Venice: వెనిస్ ఎగ్జిబిషన్ నుంచి కోట్లాది రూపాయల విలువైన భారత ఆభరణాలు చోరీ!

  • మొఘలుల కాలం నాటి చెవి రింగులు మాయం
  • ఎగ్జిబిషన్ చివరి రోజున ఘటన
  • ఆలస్యంగా మోగిన సెక్యూరిటీ అలారం
  • తప్పించుకున్న దొంగలు

ఇటలీలోని వెనిస్ నగరంలో వెనెటియన్ ప్యాలెస్‌లో నిర్వహిస్తున్న ‘ఏఐ థాని కలెక్షన్’ ఎగ్జిబిషన్ నుంచి విలువైన భారతీయ వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి. ఎగ్జిబిషన్ చివరి రోజైన బుధవారం చెవి ఆభరణాలు మాయమైనట్టు పోలీసులు తెలిపారు. చోరీకి గురైన ఆభరణాలు మొఘలుల కాలం నాటి బంగారం, ప్లాటినమ్, వజ్రాలు పొదిగిన చెవి రింగులని వివరించారు. వీటి విలువ భారత కరెన్సీలో కోట్లాది రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు.

ఉదయం పదిగంటల సమయంలో ప్యాలెస్‌లోని సెక్యూరిటీ అలారం మోగిందని, ఆ వెంటనే ఆ ప్రాంతాన్ని సీల్ చేశామని పోలీసులు తెలిపారు. అయితే అప్పటికే దొంగలు మ్యూజియం నుంచి పరారయ్యారని వివరించారు. అలారం ఆలస్యంగా మోగేలా దొంగలు మేనేజ్ చేశారని, ఫలితంగా తప్పించుకోగలిగారని పేర్కొన్నారు. వారి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.

More Telugu News