వెనిస్ ఎగ్జిబిషన్ నుంచి కోట్లాది రూపాయల విలువైన భారత ఆభరణాలు చోరీ!

- మొఘలుల కాలం నాటి చెవి రింగులు మాయం
- ఎగ్జిబిషన్ చివరి రోజున ఘటన
- ఆలస్యంగా మోగిన సెక్యూరిటీ అలారం
- తప్పించుకున్న దొంగలు
ఉదయం పదిగంటల సమయంలో ప్యాలెస్‌లోని సెక్యూరిటీ అలారం మోగిందని, ఆ వెంటనే ఆ ప్రాంతాన్ని సీల్ చేశామని పోలీసులు తెలిపారు. అయితే అప్పటికే దొంగలు మ్యూజియం నుంచి పరారయ్యారని వివరించారు. అలారం ఆలస్యంగా మోగేలా దొంగలు మేనేజ్ చేశారని, ఫలితంగా తప్పించుకోగలిగారని పేర్కొన్నారు. వారి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.