మెట్రో పిల్లర్ కూలిపోయిందంటూ వదంతులు.. టీవీల్లో బ్రేకింగ్ న్యూస్‌లు.. బెంగళూరులో కలకలం!
- మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టిన ట్రక్కు
- పిల్లర్ కూలిపోయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్
- అంతా ఉత్తిదేనన్న పోలీసులు
నగర శివారులోని నయందహళ్లిలో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లరును ఓ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో పిల్లర్ కొంత మేర దెబ్బతింది. ట్రక్కు డ్రైవర్ పరారయ్యాడు. అయితే వాస్తవాన్ని తెలుసుకోకుండానే కొందరు సోషల్ మీడియాలో విపరీత ప్రచారం చేశారు. పిల్లర్ కూలిపోయిందని పోస్టులు పెట్టారు. దీంతో క్షణాల్లోనే ఈ వార్త నగరమంతా పాకిపోయింది. దీంతో స్పందించిన పోలీసులు, మెట్రో అధికారులు అవి వదంతులు మాత్రమేనని, నమ్మవద్దని కోరారు.