market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • సెన్సెక్స్ లాభం 176 పాయింట్లు
  • నిఫ్టీ లాభం 62 పాయింట్లు
  • డాల‌ర్‌తో రూపాయి మార‌కం విలువ రూ. 63.40

గురువారం నాడు మార్కెట్లు ఆరంభంలో కొంత నెమ్మ‌దిగా న‌డిచాయి. దీంతో గ‌త రెండ్రోజుల్లాగానే ఇవాళ కూడా న‌ష్టాలు వ‌స్తాయేమోన‌ని మదుప‌ర్లు అనుకున్నారు. కానీ వారి అంచ‌నాల‌కు విరుద్ధంగా ముగింపు స‌మ‌యానికి మార్కెట్లు పుంజుకున్నాయి. సెన్సెక్స్‌ 176 పాయింట్లు ఎగబాకి 33,970 వద్ద స్థిరపడ‌గా, నిఫ్టీ 62 పాయింట్ల లాభంతో 10,505 వద్ద ముగిసింది.

అంత‌ర్జాతీయ మార్కెట్ల‌తో పాటు ఐటీ, బ్యాంకింగ్‌, ఆటోమొబైల్‌, లోహ రంగాల కంపెనీల షేర్లు రాణించడం వ‌ల్లే ఈ లాభాలు సాధ్య‌మైన‌ట్లు విశ్లేష‌కులు అభిప్రాయప‌డుతున్నారు. ఇక డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 63.40గా కొనసాగుతోంది. లాభ‌ప‌డిన షేర్ల‌లో టాటాస్టీల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఎల్‌అండ్‌టీ, ఏషియన్‌ పెయింట్స్‌, ఓఎన్‌జీసీలు ఉండ‌గా, టాటామోటార్స్‌, ఐషర్‌ మోటార్స్‌, భారత్‌ పెట్రోలియం, ఇన్ఫోసిస్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.

More Telugu News