rana: వేసవిలో రానున్న రానా చారిత్రక చిత్రం!

  • రానా హీరోగా 1945
  • కథానాయికగా రెజీనా 
  • తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో విడుదల

'బాహుబలి' అందించిన భారీ క్రేజ్ ను కాపాడుకుంటూ, విభిన్నమైన సినిమాలను చేసుకుంటూ రానా ముందుకు వెళుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన 'ఘాజీ' .. 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలతో చెప్పుకోదగిన విజయాలను అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన 1945 అనే సినిమా చేస్తున్నాడు. యుద్ధం నేపథ్యంతో కూడుకున్న చారిత్రక ప్రేమకథగా  ఈ సినిమా తెరకెక్కుతోంది.

సత్యశివ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, 'సుభాష్ చంద్రబోస్' స్థాపించిన 'ఆజాద్ హింద్ ఫౌజ్'లో రానా ఓ సైనికుడిగా కనిపించనున్నాడు. రానా సరసన కథానాయికగా రెజీనా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ షూటింగ్ పూర్తి చేసుకుంది. బ్రహ్మానందం .. నాజర్ .. సత్యరాజ్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తోన్న ఈ సినిమాను, తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో వేసవిలో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.

More Telugu News