Pakistan: పాకిస్థాన్ త‌రువాత‌.. పాల‌స్తీనాను హెచ్చ‌రించిన డొనాల్డ్ ట్రంప్

  • శాంతి చర్చలకు ఒప్పుకోకపోతే పాలస్తీనాకు కూడా సాయం నిలిపేస్తాం
  • ఆ దేశానికి సాయం చేయడం వల్ల మాకు ఒనగూరేది ఎమీ లేదు 
  • భవిష్యత్తులోనూ మేము ఎందుకు సాయం చేయాలి?

ఉగ్రవాదులను ప్రోత్సహిస్తోన్న దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన పాలస్తీనాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి చర్చలకు ఒప్పుకోకపోతే పాలస్తీనాకు కూడా సాయం నిలిపేస్తామని ట్విట్టర్ ద్వారా హెచ్చరించారు. ఆ దేశానికి సాయం చేయడం వల్ల తమ దేశానికి ఎలాంటి గౌరవం, ప్ర‌శంస‌లు ద‌క్కే అవ‌కాశాలు లేవ‌ని అన్నారు. పాలస్తీనా కోసం ప్ర‌తి ఏడాది తాము వందల మిలియన్ల డాలర్లు ఖ‌ర్చుచేస్తున్నామ‌ని, కానీ ఇజ్రాయెల్‌తో శాంతి చర్చలకు పాలస్తీనా ఒప్పుకోవ‌డం లేద‌ని అన్నారు. భవిష్యత్తులోనూ తాము ఎందుకు సాయం చేయాలని ప్ర‌శ్నించారు. పాకిస్థాన్‌ను హెచ్చరించిన రెండు రోజులకే ట్రంప్.. పాలస్తీనాను హెచ్చరించడం గమనార్హం. 

More Telugu News