రూ. 46 వేల శాంసంగ్ గెలాక్సీ ఎస్ 7 రూ. 8,890కే!

  • మొబైల్ బొనాంజాలో భారీ తగ్గింపు
  • రూ. 19,010 స్పాట్ డిస్కౌంట్
  • ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ. 18 వేల వరకూ డిస్కౌంట్
రూ. 46 వేల విలువైన శాంసంగ్ గెలాక్సీ ఎస్ 7 ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ తన 'మొబైల్ బొనాంజా'లో భాగంగా రూ. 8,990కే పొందే అవకాశాన్ని దగ్గర చేసింది. ఈ ఫోన్ పై రూ. 19,010 స్పాట్ డిస్కౌంట్ ను అందిస్తామని తెలిపింది. దీనికి అదనంగా పాత స్మార్ట్ ఫోన్ ను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే మరో రూ. 18 వేల వరకూ తగ్గింపును అందిస్తామని తెలిపింది.

బ్లాక్ ఆనెక్స్‌, గోల్డ్‌ ప్లాటినం, సిల్వర్‌ టైటానియం కలర్స్ లో లభ్యమయ్యే ఫోన్ లో 5.1 అంగుళాల స్క్రీన్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 12 / 5 ఎంపీ కెమెరాలు, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ సదుపాయాలు ఉంటాయి. ఇక ఇదే సమయంలో రూ. 12,999 ధరలో ఉండే రెడ్ మీ నోట్ ను రూ. 10 వేలకు, రూ. 14,999 ధరలో ఉండే షావోమీ ఎంఐ ఏ1 ను రూ. 12,999కి అందిస్తామని పేర్కొంది. రూ. 61 వేల ఖరీదైన గూగుల్ పిక్సెల్ 2, 2 ఎక్స్ ఎల్ ను రూ. 39,999కి అందిస్తామని ఆఫర్ ఇచ్చింది. 
Go Back to Shorts
Samsung
Flipkart
Discount

More Telugu News