న్యూ ఇయర్ పార్టీకి రూ. 26 కోట్ల ఖర్చు... ఉద్యోగులకు ఆనందాన్ని పంచిన సీఈఓ
- గొప్ప పార్టీ ఇచ్చిన స్నాప్‌చాట్ సీఈఓ ఇవాన్ స్పైగల్
- లాస్ఏంజెల్స్లోని మైక్రోసాఫ్ట్ థియేటర్లో పార్టీ
- హాజరైన వివిధ దేశాల ఉద్యోగులు
అమెరికాలోని లాస్ఏంజెల్స్లో మైక్రోసాఫ్ట్ థియేటర్లో ఈ పార్టీ జరిగింది. ప్రపంచవ్యాప్త వంటకాలతో పాటు గేమ్స్, అమెరికన్ పాప్‌స్టార్ డ్రేక్‌తో కచేరీ కూడా ఈ పార్టీలో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా స్నాప్‌చాట్ కార్యాలయాల్లో పనిచేసే దాదాపు 5000ల మందికి పైగా ఉద్యోగులు ఈ పార్టీకి హాజరైనట్లు తెలుస్తోంది. పార్టీ ఖర్చు మొత్తం ఇవానే పెట్టుకున్నారు. ఆయన వార్షిక ఆదాయం 3.5 బిలియన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.22 వేల కోట్లు.