Shahrukh Khan: మ‌రుగుజ్జు పాత్ర‌లో షారుక్‌... ఆక‌ట్టుకుంటున్న `జీరో` టీజ‌ర్‌

  • ద‌ర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్
  • హీరోయిన్లు అనుష్క శ‌ర్మ‌, క‌త్రినా కైఫ్
  • 2018, డిసెంబ‌ర్ 21న విడుద‌ల

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కొత్త చిత్రం 'జీరో' టీజ‌ర్ విడుద‌లైంది. ఈ చిత్రంలో షారుక్ మ‌రుగుజ్జు పాత్ర‌లో క‌నిపిస్తున్నారు. ఆనంద్ ఎల్ రాయ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో షారుక్ స‌ర‌స‌న అనుష్క శ‌ర్మ న‌టిస్తోంది. క‌త్రినా కైఫ్ కూడా ఓ పాత్రలో న‌టిస్తోంది.

గ‌తంలో షారుక్‌, క‌త్రినా, అనుష్క శ‌ర్మ‌లు క‌లిసి 'జ‌బ్ త‌క్ హై జాన్' సినిమాలో న‌టించారు. ఈ చిత్రానికి షారుక్ భార్య గౌరీ ఖాన్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 2018 డిసెంబ‌ర్ 21న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు.

ఈ చిత్ర టీజ‌ర్‌లో మ‌రుగుజ్జు పాత్ర‌లో షారుక్ చేస్తున్న డ్యాన్స్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ఈ పాత్ర కోసం షారుక్‌ని మించిన న‌టుడు మ‌రొక‌రు దొర‌క‌లేద‌ని, ఆయ‌న అయితేనే పాత్ర‌కు న్యాయం చేయ‌గ‌ల‌ర‌ని టీజ‌ర్ విడుద‌ల సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు ఆనంద్ ఎల్ రాయ్ అన్నారు.

More Telugu News