న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్న 200 మంది స్కూల్ విద్యార్థులకు కంటి సమస్య
న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్న 200 మంది విద్యార్థులకు కంటి సమస్య తలెత్తిన ఘటన విజయనగరంలోని పార్వతీపురం సురేష్ పబ్లిక్ స్కూల్లో చోటు చేసుకుంది. సదరు స్కూలు యాజమాన్యం నిర్వహించిన న్యూ ఇయర్ వేడుకల్లో విద్యార్థులు పాల్గొన్నారు. అయితే, అక్కడ వాడిన డీజే లైటింగ్ ప్రభావంగానే పిల్లలకు కంటి సమస్య తలెత్తినట్లు వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులు కంటి సమస్యలతో బాధపడుతుండడంతో ఆ పాఠశాల యాజమాన్యం సెలవు ప్రకటించింది. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.