google: కెన్యాలో కుప్పకూలిన ‘గూగుల్’ బెలూన్!

  • కుప్పకూలిన హై స్పీడ్ ఇంటర్ నెట్ సేవలందించే బెలూన్ 
  • స్థానిక మీడియా కథనం
  • కూలిన బెలూన్ ని చూసేందుకు వెళ్లిన గ్రామస్థులకు అస్వస్థత

అత్యంత ఎత్తులోకి బెలూన్లను వదలడం ద్వారా భూమిపై కనీస సౌకర్యాలు లేని ప్రాంతాలకు సైతం హై స్పీడ్ ఇంటర్ నెట్ సేవలు అందించనున్నట్టు ‘గూగుల్’ గత ఏడాది ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ‘ప్రాజెక్టు లూన్’ పేరిట పది బెలూన్లతో కూడిన అతిపెద్ద బెలూన్ ను ఈ ఏడాది జులైలో ప్రయోగించారు. ఈ అతిపెద్ద బెలూన్ కెన్యా పంట పొలాల్లో కుప్పకూలింది.

శుక్రవారం రాత్రి మెరులోని ఎన్ థంబిరోలో అకస్మాత్తుగా ఈ అతిపెద్ద బెలూన్ కూలినట్టు స్థానిక మీడియా కథనం. కూలిన బెలూన్ ని చూసేందుకు వెళ్లిన గ్రామస్థులు ఆ తర్వాత విపరీతమైన తలనొప్పికి గురైనట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా స్థానిక అధికారులు మాట్లాడుతూ, ఈ బెలూన్ కాలపరిమితి ఆరు నెలలని, ఆ వ్యవధి పూర్తయిన కారణంగానే అది కూలిపోయిందని అభిప్రాయపడ్డారు.

అయితే, కూలిన బెలూన్ తమకు చెందిందంటూ ఎవరూ ఇంతవరకూ ప్రకటించలేదని తెలిపారు. కాగా, ఈ అతిపెద్ద బెలూన్ ను పరీక్షల నిమిత్తం నకురు, నన్యుకు, ఎన్ యేరీ, మర్సాబిత్ లో ప్రాంతాల్లో ఉంచారు.

More Telugu News