samsung galaxy note: శామ్ సంగ్ గెలాక్సీ నోట్ 8 ఫోన్లో సాంకేతిక సమస్యలు

  • చార్జింగ్ పరంగా సమస్యలు
  • శ్యామ్ సంగ్ కేర్ కు కస్టమర్ల నుంచి ఫిర్యాదులు
  • హ్యాండ్ సెట్ మార్చుకున్నా తొలగని సమస్య

శామ్ సంగ్ గెలాక్సీ నోట్ 8 సిరీస్ స్మార్ట్ ఫోన్లలో మరోసారి సమస్యలు వెలుగులోకి వచ్చాయి. గెలాక్సీ నోట్ 8లో చార్జింగ్ సమస్యలను ఎదుర్కొంటున్నట్టు కొందరు యూజర్లు కంపెనీ సపోర్ట్ ఫోరమ్స్ లో ఫిర్యాదు చేశారు. బ్యాటరీ పవర్ పూర్తిగా అయిపోయిన తర్వాత చార్జింగ్, తిరిగి ఆన్ అవడంలో సమస్య ఎదురవుతున్నట్టు సమాచారం. దీంతో కొందరు యూజర్లు ఫిర్యాదు చేసి తమ హ్యాండ్ సెట్లను మార్చుకున్నారు.

అయితే, ఇలా మార్చుకున్న వారిలో కొందరు ఈ సమస్య మళ్లీ తలెత్తినట్టు కంపెనీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై శ్యామ్ సంగ్ ఇండియా అధికార ప్రతినిధి స్పందిస్తూ... కంపెనీ ఈ అంశాన్ని అధ్యయనం చేస్తోందని, ఎవరైనా కస్టమర్ ఈ సమస్యను ఎదుర్కొంటుంటే సమీపంలోని శ్యామ్ సంగ్ కస్టమర్ కేర్ సెంటర్ కు వెళ్లాలని సూచించారు.

More Telugu News