prabhudeva: ఆసక్తిని రేపుతోన్న 'గులేబకావళి' ట్రైలర్ .. దుమ్మురేపేస్తోన్న ప్రభుదేవా

  • ప్రభుదేవా హీరోగా 'గులేబకావళి'
  • కథానాయికగా హన్సిక 
  • తమిళంతో పాటు తెలుగులోను విడుదల    

కొంతకాలం పాటు పూర్తిగా బాలీవుడ్ కి అంకితమైపోయి, వరుసగా హిందీ సినిమాలను తెరకెక్కించిన ప్రభుదేవా, ఈ మధ్య కాలంలో మళ్లీ కోలీవుడ్ పై దృష్టి పెట్టాడు. తమిళ సినిమాల నిర్మాణంపై .. నటనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ క్రమంలో ఆయన చేసిన 'అభినేత్రి' సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఆయన 'గులేబకావళి' సినిమాతో తమిళ .. తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.

కల్యాణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వదిలిన ఈ సినిమా ట్రైలర్ అందరిలో ఆసక్తిని రేపుతోంది. పురాతనమైన దేవతా విగ్రహాల అక్రమరవాణా నేపథ్యంలో ఈ కథ కొనసాగనున్నట్టు ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. డాన్స్ పరంగా .. ఫైట్స్ పరంగా ప్రభుదేవా మరోసారి రెచ్చిపోయినట్టుగా కనబడుతోంది. యాక్షన్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాలో కథానాయికగా హన్సిక కనిపించనుంది.

More Telugu News