stocks: 2017లో ఇన్వెస్టర్ల పెట్టుబడులను హరించిన షేర్లు

  • 25 షేర్లు 50 శాతం కంటే పతనం
  • వీటిలో వీడియోకాన్, రెలిగేర్ తదితర సంస్థలు
  • ఇదే సమయంలో నిఫ్టీ, సెన్సెక్స్ 27 శాతం వృద్ధి

స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ మెంట్ అన్నది రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. జాగ్రత్తగా ఉండకపోతే కష్టార్జితానికి చిల్లులు పడిపోతాయి. 2017లో లాభాలను పంచి ఇన్వెస్టర్లకు సంతోషాన్నిచ్చిన షేర్లే కాదు, ఇన్వెస్టర్ల చేతులు కాల్చినవీ ఉన్నాయి. ఈ ఏడాది బోంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ అయిన సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ నిఫ్టీ 27 శాతం వరకు పెరిగాయి. మొత్తం మీద 25 కంపెనీల షేర్ల ధరలు 50 శాతం కంటే ఎక్కువే తగ్గిపోయాయి.

52వీక్ ఎంటర్ ప్రైజెస్ 96 శాతం తగ్గిపోయింది. ఇంకా పిన్ కాన్ లైఫ్ స్టయిల్ 95 శాతం, షిల్పి కేబుల్, టీవీ విజన్, మీనాక్షి ఎంటర్ ప్రైజెస్, శ్రీ అధికారి బ్రదర్స్, వీడియోకాన్ ఇండస్ట్రీస్, వీబీ ఇండస్ట్రీస్, ఎస్ఏబీ ఈవెంట్స్, రెలిగేర్ ఎంటర్ ప్రైజెస్, క్రెట్టో సిస్కమ్, డీఎస్ కులకర్ణి డెవలపర్స్, వర్ధమాన్ ఇండస్ట్రీస్, పీటీఎల్ ఎంటర్ ప్రైజెస్, ఏబీజీ షిప్ యార్డ్, షాల్గుటి ఇండస్ట్రీస్, స్టీల్ ఎక్సేంజ్, తారా జ్యుయెల్స్, ఎనర్జీ డెవలప్ మెంట్ కార్పొరేషన్, అలెగ్జాండర్ స్టాంప్స్, హై గ్రౌండ్, కోసిన్, స్టాంపేడ్ క్యాప్, ఇరానీ మార్బుల్స్ షేర్లు 50 నుంచి 100 శాతం లోపు తమ విలువను కోల్పోయాయి.

More Telugu News