Chandrababu: చంద్రబాబును కలిసి తమ బాధలను చెప్పుకున్న రాజధాని రైతులు!

షార్ట్స్‌లో చూడండి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును రాజధాని రైతులు కలిశారు. తుళ్లూరులో ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్మాణానికి భూమి పూజ జరిగిన సందర్భంగా సీఎంతో వీరు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ బాధలను ముఖ్యమంత్రితో చెప్పుకున్నారు. సీఆర్డీఏ అధికారులు తమకు ప్లాట్లను కేటాయించినప్పటికీ... ఇంతవరకు రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని మాత్రం కల్పించలేదని చెప్పారు. వీరి విన్నపాన్ని సానుకూలంగా విన్న చంద్రబాబు... త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. సీఎంను కలిసిన వారిలో టీడీపీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు ముళ్లపూడి రవి, ఇతర నేతలు తలతోటి సురేంద్ర, జొన్నకూటి ఏడుకొండలు కూడా ఉన్నారు.
Go Back to Shorts
Chandrababu
amaravathi farmers

More Telugu News