రెండేళ్ల క్రితమే పెళ్లి చేసుకుని, ఇప్పుడు వెల్లడించిన బాలీవుడ్ నటి
- 2015లోనే సుర్వీన్ చావ్లా వివాహం
- ప్రియుడు అక్షయ్ ఠాకూర్ తో పెళ్లి
- వ్యక్తిగత కారణాలతో వెల్లడించని సుర్వీన్
తాజాగా మీడియాతో మాట్లాడిన సుర్వీన్... 2015 జూలై 18న తమ పెళ్లి జరిగిందని తెలిపింది. కేవలం వ్యక్తిగత కారణాలతోనే ఈ విషయాన్ని తాము బహిరంగపరచలేదని చెప్పింది. ఇప్పుడు భారతీయ పద్ధతిలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని తెలిపింది. డెసెంబర్ లో చేసుకుందామని అనుకుంటే... తమ కుటుంబంలో ఒక విషాద ఘటన నెలకొందని చెప్పింది. వచ్చే ఏడాది చేసుకుంటామని తెలిపింది

.