'జీవ' పాత్రలో మంచి మార్కులు కొట్టేసిన అల్లు శిరీష్!
- అల్లు శిరీష్ హీరోగా 'ఒక్క క్షణం'
- ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు
- అల్లు శిరీష్ నటనకు ప్రశంసలు
శిరీష్ కి చాలా డిఫరెంట్ రోల్ పడిందనీ, ఆయన ఆ పాత్రలో చాలా చక్కగా నటించాడని అంటున్నారు. గతంలో చేసిన సినిమాలతో పోల్చుకుంటే, నటనలో ఆయన చాలా పరిణతిని కనబరిచాడని చెబుతున్నారు. సున్నితమైన భావోద్వేగాలతో కూడిన సన్నివేశాల్లోను ఆయన చాలా బాగా నటించాడని అంటున్నారు. బాడీ లాంగ్వేజ్ పరంగా .. డైలాగ్ డెలివరీ పరంగా ఆయన కొత్తదనాన్ని చూపాడని చెబుతున్నారు. ఈ సినిమాతో ఆయన ఖాతాలోకి మరో హిట్ చేరుతుందేమో చూడాలి.