jagapathibabu: రవితేజకు విలన్ గా జగపతిబాబు!

  • రవితేజ తదుపరి చిత్రంగా 'నేల టికెట్'
  • కథానాయికగా మాళవిక శర్మ 
  • జనవరి 5వ తేదీన సెట్స్ పైకి  

రవితేజ తాజా చిత్రంగా 'టచ్ చేసి చూడు' వచ్చేనెలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఆ వెంటనే ఆయన తన తదుపరి సినిమాను మొదలుపెట్టడానికి రెడీ అవుతున్నాడు. జనవరి 5వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేస్తున్నారు. కల్యాణకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.

ఈ సినిమాకి 'నేల టికెట్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. కథానాయికగా మాళవిక శర్మను ఎంపిక చేసుకున్నారు. ఇక విలన్ గా కొంతమంది పేర్లను పరిశీలించి, చివరికి జగపతిబాబును ఫైనలైజ్ చేశారట. ఈ సినిమాలో జగపతిబాబు పాత్ర చాలా డిఫరెంట్ గా .. పవర్ ఫుల్ గా ఉంటుందని అంటున్నారు. రామ్ తాళ్లూరి నిర్మిస్తోన్న ఈ సినిమాలో, ముఖ్యమైన పాత్రలకు గాను మరికొంతమంది సీనియర్ ఆర్టిస్టులను తీసుకోనున్నట్టు సమాచారం.   

More Telugu News