ఎవరెస్ట్‌పైనా చైనా రాజకీయం.. భారత్ ప్రతిపాదనలను తిరస్కరించిన నేపాల్!
- నేపాల్ తో కలసి ఎవరెస్ట్ ఎత్తును కొలిచేందుకు ప్రతిపాదించిన భారత్
- తామే కొలుస్తామన్న నేపాల్
- 2015 భూకంపంతో ఎవరెస్ట్ ఎత్తుపై అనుమానాలు
2015లో 7.8 తీవ్రతతో నేపాల్ ను కుదిపేసిన భారీ భూకంపం తర్వాత ఎవరెస్ట్ ఎత్తు తగ్గిందనే సందేహాలు సర్వత్ర నెలకొన్నాయి. దీంతో, నేపాల్ సర్వే డిపార్ట్ మెంట్ తో కలిసి ఎవరెస్ట్ ఎత్తును మరోసారి కొలిచేందుకు సర్వే ఆఫ్ ఇండియా ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనలను నేపాల్ తిరస్కరించింది.