akhil: తెలుగు రాష్ట్రాల్లో 'హలో' 4 రోజుల వసూళ్లు!

  • 'హలో'కి తొలి రోజున భారీ ఓపెనింగ్స్ 
  • 4 రోజుల్లో నైజామ్ లో 3.62 కోట్లు 
  • తెలుగు రాష్ట్రాల్లో 4 రోజులలో మొత్తం 9.28 కోట్లు

అఖిల్ రెండవ సినిమాగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన 'హలో' ఈ నెల 22వ తేదీన ప్రేక్షకులను పలకరించింది. కల్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటించిన ఈ సినిమా, తొలి రోజున భారీ ఓపెనింగ్స్ ను సాధించింది. హీరో .. హీరోయిన్స్ ఇద్దరూ కూడా నటన పరంగా మంచి మార్కులు కొట్టేశారు.  

ఇక తొలి 4 రోజుల్లో ఈ సినిమా నైజామ్ లో అత్యధికంగా 3.62 కోట్లను వసూలు చేసింది. అదే 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొత్తం 9.28 కోట్లను వసూలు చేసినట్టు తెలుస్తోంది. తొలి సినిమాలో కంటే ఈ సినిమాలో అఖిల్ మరింత హ్యాండ్సమ్ గా ఉన్నాడనీ, డాన్స్ ను .. ఫైట్స్ ను మరింత ఈజ్ తో చేశాడని అంటున్నారు.  

More Telugu News