Parvati TK: నేనే కాదు, ఏంతో మంది హీరోయిన్లు 'సైబర్ బుల్లీయింగ్' బాధితులే!: పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి పార్వతి

  • పార్వతి నటించిన 'కసబా' చిత్రంపై విమర్శలు
  • హత్య చేస్తామని, అత్యాచారం చేస్తామని బెదిరింపులు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి

ఇటీవల విడుదలైన మలయాళ చిత్రం 'కసబా'పై విమర్శలు వచ్చిన తరువాత, ఆన్ లైన్ మాధ్యమంగా తనకు వేధింపులు, బెదిరింపులు పెరిగిపోయాయని అవార్డు విన్నింగ్ నటి పార్వతీ టీకే పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా 'ఎన్డీటీవీ'కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, ఈ సమస్య తనకు మాత్రమే సంబంధించినది కాదని, ఎంతో మంది హీరోయిన్లు 'సైబర్ బుల్లీయింగ్' (ఆన్ లైన్ బెదిరింపులు) బాధితులేనని పేర్కొంది.

 "ఇటీవలి కాలంలో ఆన్ లైన్ బెదిరింపులు పెరిగిపోయాయి. ఇది నా సమస్య మాత్రమే కాదు. ఓ వైవిధ్యభరితమైన అభిప్రాయాన్ని చెప్పిన ప్రతి మహిళా ఎదుర్కొంటున్నదే. ఎన్నో ఏళ్లుగా దీనిపై నిశ్శబ్దంగా ఉన్నాము. నేను 11 సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో ఉన్నాను. అభిమానులు నాకెంతో మద్దతిచ్చారు. ఇప్పుడు నోరు విప్పాల్సిన సమయం వచ్చింది" అని తనకు ఎదురైన బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తరువాత పార్వతి వ్యాఖ్యానించింది.

తనను చంపుతామని, అత్యాచారం చేస్తామని, యాసిడ్ దాడులు చేస్తామని బెదిరింపులు వచ్చాయని పేర్కొంది. సూపర్ స్టార్ మమ్ముట్టితో కలసి పార్వతి చేసిన చిత్రంలో మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

More Telugu News