వాటి తొలి కస్టమర్లు కోహ్లీ-అనుష్క అయితేనే బాగుంటుందట.. రాఖీ సావంత్ వివాదాస్పద వ్యాఖ్యలు!
- ‘బీబోయ్’ కండోమ్‌ల తొలి వినియోగదారులు కోహ్లీ జంట కావాలన్న రాఖీ
- పతంజలి కండోములు తయారుచేయాలంటూ రాందేవ్ బాబాకు సవాలు
- వివాదాస్పదమవుతున్న రాఖీ సావంత్ వ్యాఖ్యలు
తాజాగా ‘బీబోయ్’ కండోమ్ బ్రాండ్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రాఖీ సావంత్ మాట్లాడుతూ.. స్వదేశీ బ్రాండ్‌తో వస్తున్న రాందేవ్ బాబాకు దమ్ముంటే పతంజలి బ్రాండ్ కండోమ్‌లు తయారుచేసి చూపించాలని సవాలు విసిరిసింది. ప్రజలు పతంజలి కండోమ్ లను చూడాలనుకుంటున్నారని పేర్కొంది. కాగా, తాను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ‘బీబోయ్’ కండోములకు క్రికెటర్ కోహ్లీ-అనుష్క జంట తొలి వినియోగదారులు అయితే బాగుంటుందన్న రాఖీ.. అవి వాడి ఎలా ఉన్నాయో చెప్పాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.