అన్నాడీఎంకే ఓటమికి తెలుగువారు, హీరో విశాల్ కారణం: కేతిరెడ్డి
- ఆర్కే నగర్ కు దినకరన్ చేసిందేమీ లేదు
- ఈ ఎన్నికల్లో డబ్బే గెలిచింది
- తమిళనాడులో బీజేపీ జీరో
ఆర్కే నగర్ లో నిరుపేద ఓటర్లు ఎక్కువగా ఉన్నారని... వారికి భారీ మొత్తంలో నగదు పంపిణీ చేశారని... దినకరన్ విజయానికి ఇదే కారణమని కేతిరెడ్డి చెప్పారు. రెండాకుల గుర్తు వచ్చిందనే ధీమాలో అన్నాడీఎంకే ఉండిపోయిందని... గుర్తు కంటే డబ్బే గొప్పది అనే విషయాన్ని వారు విస్మరించారని అన్నారు. ఎన్నికలకు ఒక రోజు ముందు జయలలిత వీడియోను విడుదల చేయడం కూడా దినకరన్ కు కలిసొచ్చిందని చెప్పారు. తమిళనాడులో బీజేపీ రావడం అసాధ్యమనే విషయం ఈ ఎన్నికలతో తేలిపోయిందని తెలిపారు. దినకరన్ గెలుపుతో తమిళనాడులో రాజకీయ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని చెప్పారు.