జాతీయ రహదారిపై ఎమ్మార్పీఎస్ కార్యకర్తల ఆందోళన!
- జైల్లో ఉన్న మంద కృష్ణ మాదిగను విడుదల చేయాలని డిమాండ్
- వరంగల్ - హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
- నిరసనను విరమింపజేసిన పోలీసులు
మంద కృష్ణను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో యాదాద్రి జిల్లాలో వరంగల్ - హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ నిరసన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను శాంతింపజేసి, వెనక్కి పంపించేశారు.