BJP: పేదలకు అవి ఇస్తే చాలు ఓట్లు రాల‌తాయి: యూపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

  • పేదలు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు
  • మంచి చేస్తామన్న వారికి ఓట్లు వేయడం లేదు
  • మాంసం, మందు ఇచ్చేవారికే వేస్తున్నారు
  • వెనుకబడిన తరగతుల శాఖకు మంత్రిగా ఉండి పేద‌ల‌పైనే వ్యాఖ్య‌లు
ఉత్తరప్రదేశ్ మంత్రి ఓం ప్రకాశ్‌ రాజ్‌భర్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ... పేదలు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని అన్నారు. మంచి చేస్తామన్న వారికి ఓట్లు వేయడం లేద‌ని, మాంసం, మందు ఇచ్చేవారికే ఓట్లేస్తున్నారని అన్నారు.

వారి ఓట్లతోనే ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వాలు ఏర్పాటు చేశార‌ని, కానీ ఆయా పార్టీల నేత‌లు గెలిచాక మళ్లీ ఎన్నికలు వచ్చేవరకు వారిని పేదలుగానే చూస్తారని అన్నారు. ఆ రాష్ట్ర‌ వెనుకబడిన తరగతుల శాఖ మంత్రిగా ఉన్న‌ స‌ద‌రు నేత పేద‌ల‌పై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ప‌ట్ల వివాదం రాజుకుంది. గ‌తంలోనూ ఓం ప్ర‌కాశ్ ఇటువంటి వ్యాఖ్య‌లే చేశారు.
BJP
minarities
Uttar Pradesh

More Telugu News