hyderabad nawabs: జూబ్లీహిల్స్ లో కారు బోల్తా.. స్వల్పంగా గాయపడ్డ సినీ నటుడు ఆర్కే!

  • ఆర్కే ప్రయాణిస్తున్న కారును ఢీకొన్న మరో కారు
  • వేగంగా కారును డ్రైవ్ చేస్తూ, ప్రమాదానికి కారణమైన మహిళ
  • అపోలో ఆసుపత్రికి తరలింపు
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో జరిగిన కారు యాక్సిడెంట్ లో 'హైదరాబాద్ నవాబ్స్' మూవీ ఫేం ఆర్కే స్పల్పంగా గాయపడ్డాడు. నిన్న సాయంత్రం జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 31 నుంచి రోడ్ నంబర్ 36 వైపు ఆర్కే వెళుతుండగా... పక్క నుంచి వేగంగా వచ్చిన మరో కారు ఆర్కే కారును ఢీకొంది. దీంతో, ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తా కొట్టింది.

అక్కడున్న స్థానికులు ఆర్కేను కారు నుంచి బయటకు తీశారు. గాయపడ్డ ఆర్కేను అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారును ఓ మహిళ నడిపింది. టర్నింగ్ వద్ద వేగంగా నడపడంతో, కారు అదుపు తప్పిందని, ఆర్కే కారును ఢీకొందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. 
hyderabad nawabs
hyderabad nawabs rk
accident to rk

More Telugu News