ఇక ఇంటికి తిరిగి వెళ్లిపోదాం అనుకున్న సమయంలో బన్నీ నుంచి ఫోన్ వచ్చింది: శేఖర్ మాస్టర్
- డాన్స్ పట్ల ఇష్టంతోనే హైదరాబాద్ వచ్చాను
- రాకేశ్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా చేరాను
- బన్నీ నుంచి ఫోన్ కాల్ వచ్చింది
- ఆయన అలా మెచ్చుకున్నారు
"ఫస్టు నాకు పేరు వచ్చిన సాంగ్ .. 'ఎస్. ఎమ్. ఎస్. చిత్రంలోనిది. ఈ సినిమాలోని సాంగ్ చూసే బన్నీ .. ఎన్టీఆర్ అవకాశాలు ఇచ్చారు. సినిమాలు చేస్తున్నాను .. పైకి రావడం లేదు .. ఇంక వెళ్లిపోదాం ఊరు అనుకుంటున్నాను. ఆ సమయంలో బన్నీ ఫోన్ చేశారు .. ఈ సాంగ్ బాగా చేస్తే నిలబడతావ్ .. లేదంటే ఊరెళ్లిపోతావ్ అని మనసులో అనుకున్నాను. ' డాన్స్ పట్ల నీ అంకిత భావం చూస్తుంటే .. అమ్మాయి అయితే పెళ్లి చేసుకునేవాడిని' అని బన్నీ అన్నారంటూ నవ్వేశారు.