Sudarshan Patnaik: లిమ్కా బుక్స్ లోకి ఎక్కనున్న సైకత 'శాంటాక్లాజ్' ఇదిగో!

  • భారీ శిల్పాన్ని తయారు చేసిన సుదర్శన్ పట్నాయక్
  • 600 టన్నుల ఇసుకతో శాంటాక్లజ్
  • అందరినీ ఆకర్షిస్తున్న సైకత శిల్పం

ఈ క్రిస్మస్ సందర్భంగా ఒడిశాకు చెందిన సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ తయారు చేసిన భారీ శాంతాక్లాజ్ శిల్పం ఇప్పుడు లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకోనుంది. దాదాపు 600 టన్నుల ఇసుకను వాడుతూ, 25 అడుగుల ఎత్తు, 50 అడుగుల వెడల్పు ఉండేలా ఈ శిల్పాన్ని తయారు చేశామని ఈ సందర్భంగా సుదర్శన్ వెల్లడించారు.

తనకు 40 మంది శిష్యులు సహకరించారని, దాదాపు 35 గంటల పాటు శ్రమించి దీన్ని రూపొందించామని పేర్కొన్నారు. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ, ఈ క్రిస్మస్ సందర్భంగా దీన్ని తయారు చేశామని చెప్పారు. ఈ శిల్పం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. సుదర్శన్ నిర్మించిన శాంటాక్లజ్ సైకత శిల్పాన్ని మీరూ చూడవచ్చు.

More Telugu News