డబ్బు కోసం ఇలా దిగజారాలా?: రాంగోపాల్ వర్మపై నిప్పులు చెరిగిన మంత్రి ఆదినారాయణరెడ్డి

24-12-2017 Sun 08:03
  • 'కడప' సిరీస్ పై స్పందించిన మంత్రి
  • తమ ప్రాంతాన్ని కించపరుస్తున్నారని విమర్శలు
  • రీల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్ లోకి రావాలని హితవు
  • ప్రజలను అవమానిస్తే సహించబోమని హెచ్చరిక

డబ్బులు సంపాదించడం కోసం ఇంతగా దిగజారడం అవసరమా? అని దర్శకుడు రాంగోపాల్ వర్మపై ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదినారాయణరెడ్డి నిప్పులు చెరిగారు. వర్మ తీస్తున్న 'కడప' షార్ట్ ఫిల్మ్ సిరీస్ పై స్పందించిన ఆయన, తమ ప్రాంతాన్ని కించపరిస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ముందు ఆయన రీల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్ లోకి రావాలని, ఒకసారి కడపకు వచ్చి చూస్తే వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. గతంలో జరిగిన కొన్ని ఘటనలను సాకుగా చూపి, ఇప్పుడు డబ్బులు వెనకేసుకోవాలని ఆయన భావిస్తున్నారని, ఈ ప్రాంత ప్రజలను అవమానించాలని ఆయన చూస్తున్నారని ఆరోపించారు.