lalu prasad yadav: నా కొడుకు ఉన్నాడు.. నాకేం భయం లేదు: లాలూ ప్రసాద్

  • దాణా స్కాంలో నేడు సీబీఐ కోర్టు తీర్పు
  • బీజేపీ కుట్రలు ఫలించబోవన్న లాలూ
  • 2జీ స్కాం కేసులో జరిగిందే నా విషయంలో కూడా జరుగుతుంది

దాణా స్కాంకు సంబంధించి 2013లో కోర్టులో జడ్జి ముందు ఉన్నప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ చాలా టెన్షన్ పడ్డారు. తనకు శిక్ష పడితే ఆర్జేడీని ఎవరు చూసుకుంటారని మథనపడిపోయారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన ఎంతో ధైర్యంగా ఉన్నారు. ఈ స్కాంకు సంబంధించి నేడు సీబీఐ కోర్టు తీర్పును వెలువరించనుంది. ఈ నేపథ్యంలో, తీర్పు తనకు అనుకూలంగా వచ్చినా, వ్యతిరేకంగా వచ్చినా స్వీకరించేందుకు లాలూ సిద్ధమయ్యారు. ఇప్పుడు తన కుమారుడు తేజస్వి ఉన్నాడని... పార్టీ వ్యవహారాలను అతను చూసుకుంటాడని లాలూ చెప్పారు. కోర్టు తీర్పును గౌరవిస్తామని అన్నారు. బీజేపీ కుట్రలు ఫలించబోవని చెప్పారు. 2జీ కేసు, అశోక్ చవాన్ కేసులో ఏం జరిగిందో... తమ విషయంలో కూడా అదే జరుగుతుందని అన్నారు.

లాలూ కుమారుడు, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ మాట్లాడుతూ, కోర్టు న్యాయం చేస్తుందని భావిస్తున్నామని తెలిపారు. కోర్టు తీర్పు తన తండ్రికి వ్యతిరేకంగా వస్తే, పార్టీ బాధ్యతలను స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. పార్టీ నేతలు, కార్యకర్తల అండతో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి తాను సిద్ధమేనని అన్నారు. 

More Telugu News