ఎన్టీఆర్ ను గుర్తుచేసుకోలేదంటే ఏం సమాధానం చెబుతాం?: నందిని సిధారెడ్డి

22-12-2017 Fri 20:46
  • తెలుగు మహాసభలు భాషకు, సాహిత్యానికి సంబంధించినవి
  • ఎన్టీఆర్ సినీనటుడు, మాజీ ముఖ్యమంత్రి
  •  రాజకీయ సభలైతే, ఎన్టీఆర్ ని తప్పకుండా గుర్తుచేసుకుంటాం
  • ఇవి సినిమా వాళ్ల సభలు కాదు 

హైదరాబాద్ లో ఇటీవల నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల్లో సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తావించని విషయం తెలిసిందే. ఈ విషయమై ఓ ఇంటర్వ్యూలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డిని ప్రశ్నించగా, ‘నందమూరి తారకరామారావు రచయిత కాదు, పైగా ఆయన సినీనటుడు, మాజీ ముఖ్యమంత్రి. తెలుగు మహాసభలు భాషకు, సాహిత్యానికి సంబంధించినవి. మరి, ఆయన్ని (ఎన్టీఆర్) గుర్తుచేసుకోలేదంటే దానికి ఏం సమాధానం చెబుతాం? అదే, ఇవి రాజకీయ సభలు అయితే, ఎన్టీఆర్ ని తప్పకుండా గుర్తుచేసుకుంటాం. గతంలో జరిగిన తెలుగు మహాసభలకు, ఈ మహాసభలకు పొంతన లేదు. అంతేతప్పా, ఇక్కడ ఎన్టీరామారావులు, అక్కినేని నాగేశ్వరరావులు ఉండరు. ఇవి సినిమా వాళ్ల సభలు కాదు" అని ఘాటుగా సమాధానమిచ్చారు.