PV Sindhu: 2017 టాప్ 100 భార‌తీయ సెలెబ్రిటీల జాబితాలో పీవీ సింధుకి 13వ స్థానం

  • గ‌తేడాది 62వ స్థానంలో ఉన్న సింధు
  • ఒలింపిక్ ప‌త‌కంతో విప‌రీతంగా పెరిగిన సింధు బ్రాండ్ విలువ‌
  • జాబితా వెల్ల‌డించిన ఫోర్బ్స్ ఇండియా

2017లో భార‌తీయ సెలెబ్రిటీల సంపాద‌న‌, ప్ర‌జాద‌ర‌ణ ఆధారంగా టాప్ 100 జాబితాను ఫోర్బ్స్ ఇండియా విడుద‌ల చేసింది. ఇందులో బ్యాడ్మింట‌న్ స్టార్ పీవీ సింధు 13వ స్థానంలో నిలిచింది. రూ. 57.25 కోట్ల సంపాద‌న‌తో సింధు ఈ స్థానాన్ని కైవ‌సం చేసుకుంది. గ‌తేడాది ఇదే జాబితాలో పీవీ సింధు స్థానం 62. అంటే దాదాపు 49 ర్యాంకులు ఎగ‌బాకింద‌న్న మాట‌. ఒలింపిక్ ప‌త‌కం గెలుచుకోవ‌డంతో పీవీ సింధు బ్రాండ్ విలువ ఒక్క‌సారిగా పెరిగిపోయింది. ఆమెతో ఒప్పందం చేసుకునేందుకు ఆయా బ్రాండ్ల యజమానులు ఎగ‌బ‌డ్డారు. ఒక ప‌క్క వివిధ సిరీస్‌ల‌లో ఆడుతూనే ఆమె బ్రాండింగ్ కూడా చేసేది.

ఇంకా ఈ జాబితాలో రూ. 232.83 కోట్ల సంపాద‌న‌తో స‌ల్మాన్ ఖాన్ మొద‌టిస్థానంలో నిలిచారు. ఆ త‌ర్వాతి స్థానాల్లో వ‌రుస‌గా షారుక్ ఖాన్ (రూ. 170.50 కోట్లు), విరాట్ కోహ్లీ (రూ. 100.72 కోట్లు), అక్ష‌య్ కుమార్ (రూ. 98.25 కోట్లు), స‌చిన్ టెండూల్క‌ర్ (82.50 కోట్లు), ఆమిర్ ఖాన్ (రూ. 68.75 కోట్లు), ప్రియాంక చోప్రా (రూ. 68 కోట్లు), ఎంఎస్ ధోనీ (రూ. 63.77 కోట్లు), హృతిక్ రోష‌న్ (రూ. 63.12 కోట్లు), ర‌ణ్‌వీర్ సింగ్ (రూ. 62.63 కోట్లు) ఉన్నారు. టాప్ 10లో స్థానం సంపాదించుకున్న ఏకైక న‌టిగా ప్రియాంక చోప్రా నిలిచారు.

ఇక 11వ స్థానంలో దీపికా ప‌దుకునే (రూ. 59.47 కోట్లు), 12వ స్థానంలో ఏఆర్ రెహ‌మాన్ (57.63 కోట్లు) ఉన్నారు. ఇంకా ఈ జాబితాలో రాజ‌మౌళి (15వ స్థానం, రూ. 55 కోట్లు), ప్ర‌భాస్ (22, రూ. 36.25 కోట్లు), సైనా నెహ్వాల్ (29, రూ. 31 కోట్లు), రానా (36, రూ. 22 కోట్లు), మ‌హేశ్ బాబు (37, 19.63 కోట్లు), ప‌వ‌న్ క‌ల్యాణ్ (69, రూ. 11.33 కోట్లు), అల్లు అర్జున్ (81, రూ. 7.74 కోట్లు), కిడాంబి శ్రీకాంత్ (83, రూ. 6.13 కోట్లు), సానియా మీర్జా (98, రూ. 2.80 కోట్లు) ఉన్నారు.

More Telugu News