జయలలితది ఒరిజినల్ వీడియో కాదు.. మార్ఫింగ్: మండిపడ్డ అన్నాడీఎంకే
- మార్ఫింగ్ చేసిన వీడియోను విడుదల చేశారు
- ఉప ఎన్నికలో లబ్ధి పొందేందుకే ఈ పని చేశారు
- ఆర్కే నగర్ ఉప ఎన్నిక ముందు రోజు వీడియో విడుదల
మరోవైపు ఈ వీడియోపై ముఖ్యమంత్రి పళనిస్వామి వర్గీయులు మండిపడుతున్నారు. ఈ వీడియో ఒరిజినల్ కాదని, వీడియోలో ఉన్నది జయలలిత కాదని, ఇది మార్ఫింగ్ వీడియో అని ఆరోపించారు. జయలలిత మరణించిన తర్వాత కానీ, ఈ ఏడాది కాలంగా కానీ బయటపెట్టని వీడియోను, ఇప్పుడు ఎందుకు బయటపెట్టారని ప్రశ్నించారు. ఆసుపత్రిలో ఉన్న జయను చూసేందుకు ఎవరినీ అనుమతించలేదని... చివరకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడులకు కూడా ఆమెను చూపించలేదని చెప్పారు.
ఈ నేపథ్యంలో ఈ వీడియోపై పలు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఇది ముమ్మాటికీ మార్ఫింగ్ వీడియోనే అని తెలిపారు. ఎలక్షన్ నేపథ్యంలోనే, ఇలాంటి వీడియోను దినకరన్ వర్గీయులు విడుదల చేశారని మండిపడ్డారు.