కరీంనగర్ జిల్లా కురిక్యాలలో 'కంద' పద్యం పుట్టింది!: కవిత
- రవీంద్ర భారతిలో ఐదో రోజు ప్రపంచ తెలుగు మహాసభలు
- నన్నయ కంటే ముందే తెలంగాణలో కావ్య రచన జరిగింది
- కరీంనగర్ జిల్లా కురిక్యాలలో కంద పద్యం పుట్టింది
- ప్రాచీన తెలంగాణ కవులపై జాగృతి తరఫున పుస్తకాలు ముద్రిస్తాం
తెలుగు అనే పదాన్ని మొదట వాడిన కవి పాల్కురికి సోమనాథుడని కవిత అన్నారు. ప్రాచీన తెలంగాణ కవులపై తమ జాగృతి తరఫున పుస్తకాలు ముద్రించి, వాటిని విదేశాల్లో ఉన్న తెలుగువారికి పంపిణీ చేస్తామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలల్లో తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరి చేసిందని తెలిపారు. విదేశాల్లో తెలుగు కోసం కృషి చేస్తోన్న తెలుగు వారందరినీ తాము వెతికామని, 42 దేశాల నుంచి తెలుగు వారు ఈ సభలకు హాజరయ్యారని చెప్పారు.
