america: భారత్ వద్ద అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలు.. అణు యుద్ధం తప్పకపోవచ్చు: పాకిస్థాన్

  • ప్రమాదకర ఆయుధాలను పోగేసుకుంటోంది
  • ఆయుధాలతో ప్రతిసారి పాక్ ను భయపెడుతోంది
  • భారత్ కు అమెరికా సపోర్ట్ చేస్తోంది

దక్షిణాసియా ప్రాంతం ప్రమాదపుటంచుల్లోకి వెళ్తోందని... స్థిరత్వం దెబ్బతింటోందని పాకిస్థాన్ భద్రతా సలహాదారు, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ నజీర్ ఖాన్ జాంజువా ఆందోళన వ్యక్తం చేశారు. అణుయుద్ధం జరిగే అవకాశం ఉందని అన్నారు. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ విషయంలో భారత్ తో కలసి అమెరికా కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు.

ఈ క్రమంలో అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలను భారత్ సమకూర్చుకుంటోందని, వాటన్నింటినీ స్టాక్ పెట్టుకుంటోందని తెలిపారు. ఈ ఆయుధాలతో ప్రతిసారి పాక్ ను భయపెడుతూ వస్తోందని అన్నారు. ఈ నేపథ్యంలో, అణు యుద్ధం జరిగే అవకాశాలను కొట్టిపారేయలేమని చెప్పారు.

ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల ప్రాబల్యం పెరుగుతుండటంతో...అమెరికా తన వైఫల్యాలను పాకిస్థాన్ పైకి నెడుతోందని నజీర్ మండిపడ్డారు. ఆఫ్ఘన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అవకాశాన్ని భారత్ కు అమెరికా ఇస్తోందని చెప్పారు.

More Telugu News