BJP: ముందు చెప్పినట్టుగా 150 సీట్లు రాకపోవడానికి కారణమిదే: అమిత్ షా

  • కాంగ్రెస్ పార్టీ కుల రాజకీయాలు చేసింది
  • ప్రచారంలో వారి స్థాయి దిగజారింది
  • అందుకే అనుకున్నన్ని ఓట్లు రాలేదు
  • బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా

"గుజరాత్ ఎన్నికల్లో మా పార్టీకి 150 అసెంబ్లీ సీట్లు వస్తాయి" ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు చెప్పిన మాటిది. కానీ, ఎన్నికల్లో ఆ పార్టీ 99 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. సీట్లు తగ్గినా, విజయానందంలో ఉన్న బీజేపీ నేతలు ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారు.

అయితే, ముందు చెప్పినట్టుగా 150 సీట్లు రాకపోవడానికి గల కారణం ఏంటని అమిత్ షాను మీడియా ప్రశ్నించగా, ఆయన స్పందించారు. కాంగ్రెస్ పార్టీ కుల రాజకీయాలు చేసిందని, ఆ కారణంగానే ఓట్లు తగ్గాయని అన్నారు. అమాయకులను కాంగ్రెస్ నేతలు రెచ్చగొట్టారని, వారి ప్రచార స్థాయి దిగజారిందని, అందువల్లే చాలా చోట్ల అనుకున్నన్ని ఓట్లను పొందడంలో తాము విఫలం అయ్యామని అంగీకరించారు. ప్రచార విలువను మరచిన కాంగ్రెస్, ఇంత దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతుందని అనుకోలేదని, అయినప్పటికీ, ఆ పార్టీ తమకు పోటీని ఇవ్వలేకపోయిందని వ్యాఖ్యానించారు.

More Telugu News