sridevi: జిమ్ లో వర్కౌట్లు చేస్తున్న శ్రీదేవి కుమార్తె జాన్వి.. వీడియో చూడండి

  • ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే జాన్వీకి భారీ ఫాలోయింగ్
  • జాన్వీ అందానికి అభిమానులు ఫిదా
  • పర్ ఫెక్ట్ ఫిగర్ కోసం జిమ్ లో చెమటోడుస్తున్న వైనం 

శ్రీదేవి, బోనీ కపూర్ ల కుమార్తె జాన్వీ బాలీవుడ్ మూవీ 'ధడక్'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. నటుడు షాహిద్ కపూర్ కు కజిన్ అయిన ఇషాన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. తమ ప్రేమను బతికించుకోవడానికి కుల వివక్షపై పోరాటం చేసే ప్రేమికుల కథనంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

మరోవైపు, ఇంతవరకు ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకపోయినా జాన్వీకి భారీ ఎత్తున ఫాలోయింగ్ ఉంది. ఆమె ట్విట్టర్ ను ఎంతో మంది ఫాలో అవుతున్నారు. ఆమెకు సంబంధించిన ఏ వార్త అయినా వైరల్ అవుతోంది. ఆమె అందానికి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. జాన్వీ కూడా తన శరీరాకృతిని కాపాడుకోవడానికి జిమ్ లో కష్టపడుతోంది. ట్రైనర్ సహాయంతో వర్కౌట్లు చేస్తోంది. వీడియోను మీరూ చూడండి.

More Telugu News