twitter: ట్వీట్ల‌లో అస‌భ్య ప‌ద‌జాలంపై ట్విట్ట‌ర్ వేటు... ఇవాళ్టి నుంచి అమ‌లు

  • కొత్త కంటెంట్ పాల‌సీ విధానాలు రూపొందించిన సంస్థ‌
  • నియ‌మాలు ఉల్లంఘిస్తే ప్ర‌తిచ‌ర్య‌లు
  • ఖాతాను నిలిపివేయ‌డం, తొల‌గించ‌డం జ‌రిగే అవ‌కాశం

అస‌భ్య ప‌ద‌జాలం, ఇబ్బంది క‌లిగించే ట్వీట్లను త‌గ్గించ‌డానికి ట్విట్ట‌ర్ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. ఈ విష‌య‌మై ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ కంటెంట్ పాల‌సీలో మార్పులు చేసుకుంటూ వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల రెండు కొత్త మార్పుల‌ను ట్విట్ట‌ర్ ప్ర‌వేశ‌పెట్టింది. ఇవాళ్టి నుంచి ఈ మార్పులు అమ‌ల్లోకి రానున్నాయి.

ఈ మార్పుల ప్ర‌కారం ట్వీట్‌లోగానీ, ప్రొఫైల్‌లో గానీ అస‌భ్య ప‌ద‌జాలాన్ని ఉప‌యోగించిన వారిపై ట్విట్ట‌ర్ చ‌ర్య‌లు తీసుకోనుంది. అంటే ఇలాంటి ఇబ్బందిక‌ర మెసేజ్‌ల‌ను ట్వీట్ చేసిన వారి ఖాతాను నిలిపివేయ‌డం గానీ, తొల‌గించ‌డం గానీ చేయ‌నుంది. ర‌క్త‌పాతం, విధ్వంసాలు, రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు ట్వీట్ చేసే వారిపై కూడా ఈ చ‌ర్య‌లు తీసుకోనుంది.

More Telugu News