BSE India: పడిపోయిన సెన్సెక్స్... బీజేపీ రాదేమోనన్న ఆందోళనలో 670 పాయింట్ల పతనం!

  • సెషన్ ఆరంభంలోనే భారీ నష్టం
  • గుజరాత్ లో బీజేపీకి ప్రతికూలాంశాలు
  • నష్టాల్లో గుజ్ కంపెనీల ఈక్విటీలు

గుజరాత్ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు లేవన్న వార్తలు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఈ ఉదయం 9 గంటల సమయంలో మార్కెట్ ట్రేడింగ్ సెషన్ ప్రారంభమైన తరువాత బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక, 670 పాయింట్లకు పైగా పడిపోయింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 220 పాయింట్లకు పైగా నష్టాన్ని నమోదు చేసింది.

గుజరాత్ కు చెందిన ప్రధాన కంపెనీలన్నీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆపై స్వల్పంగా కోలుకుంటున్నట్టు కనిపించిన మార్కెట్లు 9:30 తరువాత మళ్లీ నష్టాల దిశగా మళ్లాయి. క్షణక్షణం మారుతున్న ఫలితాల సరళి తీవ్ర ఉత్కంఠను కలిగిస్తోంది. తాజా ఫలితాల సరళి ప్రకారం, 182 స్థానాలున్న రాష్ట్రంలో 179 స్థానాల్లో ఫలితాల సరళి తెలుస్తుండగా, కాంగ్రెస్ 90, బీజేపీ 87 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.

More Telugu News