చంద్రబాబు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసిన హిజ్రాలు!
- హిజ్రాలకు పెన్షన్లను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- తిరుపతిలో సంబరాలు జరుపుకున్న హిజ్రాలు
- ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా
మరోవైపు, ఢిల్లీ నగర వీధుల్లో సైతం హిజ్రాలు చంద్రబాబును కొనియాడారు. హిజ్రాలకు ఇళ్లను నిర్మించారని, పెన్షన్లను ఇచ్చారని ప్రశంసించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టమెంట్ స్ట్రీట్ లో ధర్నా చేశారు. పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న ట్రాన్స్ జెండర్ 2016 బిల్లును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. హిజ్రాల అభిప్రాయాలను పట్టించుకోకుండానే బిల్లును రూపొందించారని మండిపడ్డారు. ఈ నిరసన కార్యక్రమానికి ఏపీ, తెలంగాణల నుంచి వందలాది మంది హిజ్రాలు తరలివచ్చారు.