k vishwanath: కె.విశ్వనాథ్ కు జీవిత సాఫల్య పురస్కారం

  • పురస్కారం అందజేసిన రోటరీ క్లబ్
  • ప్లాటినమ్ జూబ్లీ వేడుకల సందర్భంగా పురస్కారం
  • విశ్వనాథ్ సేవలను కొనియాడిన నిర్వాహకులు

ఎన్నో గొప్ప చిత్రాలతో తెలుగు సినీ ప్రరిశ్రమ ఖ్యాతిని ఇనుమడింపజేసిన కళాతపస్వి కె.విశ్వనాథ్ ను విజయవాడలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు. రోటరీ క్లబ్ ప్లాటినమ్ జూబ్లీ సందర్భంగా 2016-17 సంవత్సరానికి గాను ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ వేడుకలో రోటరీ క్లబ్ జీవిత సాఫల్య పురస్కార కమిటీ ఛైర్మన్ డాక్టర్ ఎంసీ దాస్, రోటరీ పౌర సంబంధాల విభాగం ఛైర్మన్ పులిపాక కృష్ణాజీ తదితరులు పాల్గొన్నారు. గాంధీనగర్ లోని శ్రీరామ ఫంక్షన్ హాల్ లో ఈ వేడుక జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, సినీ రంగానికి విశ్వనాథ్ చేసిన సేవలను కొనియాడారు. 

More Telugu News