parvez musharraf: ఉగ్రవాదులతో పొత్తుకు సిద్ధమన్న ముషారఫ్!

  • జమాతే ఉద్దవా, లష్కరే తాయిబాలతో కలసి పని చేస్తా
  • ఇతరులకు అభ్యంతరాలు అనవసరం
  • కశ్మీర్ లో ఉగ్ర చర్యలను సమర్థిస్తా

భారత్ కు వ్యతిరేకంగా పని చేస్తున్న ఉగ్రవాద సంస్థలపై పాకిస్థాన్ మాజీ సైనిక పాలకుడు ముషారఫ్ మరోసారి అభిమానాన్ని చాటుకున్నారు. జమాతే ఉద్దవా, లష్కరే తాయిబా ఉగ్రవాదులు దేశభక్తి కలవారని కీర్తించారు. దేశ భద్రత కోసం ఈ సంస్థలతో కలసి పని చేయడానికి తాను సిద్ధమని చెప్పారు. ఈ సంస్థలకు చెందిన వారు కేవలం పాకిస్థాన్ కోసమే జీవిస్తున్నారని, పాకిస్థాన్ కోసమే మరణిస్తున్నారని తెలిపారు.

ఈ సంస్థలు కలసి రాజకీయ పార్టీని స్థాపిస్తే, ఇతరులు అభ్యంతరాలను వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. వారితో పొత్తు పెట్టుకోవడానికి, కలసి పని చేయడానికి తను సిద్ధమని ప్రకటించారు. తనలో ఉదారవాద భావాలు ఉన్నప్పటికీ, కశ్మీర్ లో ఉగ్రవాదుల చర్యలను తానెప్పుడూ సమర్థిస్తూనే ఉంటానని చెప్పారు.

More Telugu News