nani: సెన్సార్ పూర్తి చేసుకున్న 'మిడిల్ క్లాస్ అబ్బాయ్'

  • 'మిడిల్ క్లాస్ అబ్బాయ్'గా వస్తోన్న నాని
  • ఈ ఏడాది నాని నుంచి వస్తోన్న మూడవ సినిమా
  • ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'మిడిల్ క్లాస్ అబ్బాయ్' చిత్రం తెరకెక్కింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో నాని .. సాయిపల్లవి జంటగా నటించారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఎక్కడా ఒక్క కట్ కూడా లేకుండా ఈ సినిమా U/A సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 21వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

 కొంత కాలంగా నాని వరుస విజయాలను అందుకుంటూ వస్తున్నాడు. ఈ ఏడాదిలో ఆయన చేసిన 'నేను లోకల్' .. 'నిన్నుకోరి' సినిమాలు భారీ విజయాలను సాధించాయి. ఈ ఏడాది ఆయన నుంచి వస్తోన్న 3వ సినిమానే 'మిడిల్ క్లాస్ అబ్బాయి'. ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ పడటం ఖాయమనే నమ్మకంతో ఆయన వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి.  

More Telugu News