Telangana: నేటి నుంచి హైదరాబాద్‌లో ‘తెలుగు’ పండుగ.. సర్వాంగ సుందరంగా ముస్తాబైన భాగ్యనగరం!

  • ఐదు రోజులపాటు ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ
  • ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్య
  • దేశ విదేశాల నుంచి ప్రతినిధుల రాక
  • సాయంత్రం ఐదు గంటలకు ఎల్బీ స్టేడియంలో ప్రారంభం

హైదరాబాద్‌లో నేటి నుంచి ‘తెలుగు’ పండుగ ప్రారంభం కానుంది. ప్రపంచ తెలుగు మహాసభలకు భాగ్యనగరం ముస్తాబైంది. నేటి నుంచి ఈనెల 19 వరకు ఐదు రోజులపాటు తెలుగు సభలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి.

సాయంత్రం ఐదు గంటలకు అధికారికంగా సభలు ప్రారంభం కానున్నాయి. సభల ప్రారంభం, ముగింపు వేడుకలకు ఎల్బీ స్టేడియం వేదిక కానుంది. తెలుగు మహాసభలకు ముఖ్య అతిథిగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరుకానుండగా ముఖ్యమంత్రి కేసీఆర్ సభాధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. గవర్నర్లు నరసింహన్, విద్యాసాగర్ రావులు విశిష్ట అతిథులుగా రానున్నారు.

ఎల్బీ స్టేడియంలో పాల్కురికి సోమనాథ ప్రాంగణం, బమ్మెర పోతన వేదికలు ఏర్పాటు చేశారు. శనివారం నుంచి ఎల్బీ స్టేడియంతోపాటు తెలుగు విశ్వవిద్యాలయం, రవీంద్ర భారతి, ఇందిరా ఆడిటోరియం, లలిత కళాతోరణం, తెలుగు సారస్వత పరిషత్‌లలో సభలు నిర్వహించనున్నారు. దేశ విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు, సాహితీవేత్తలు, కళాకారులు హాజరుకానున్నారు. దేశంలోని 19 రాష్ట్రాలతోపాటు 40 దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు.

More Telugu News