విశాఖ నుంచి వస్తున్న కాళేశ్వరి ట్రావెల్స్ బస్సు విజయవాడ శివారులో బోల్తా.. పలువురికి గాయాలు!

  • విశాఖ నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం
  • బస్సులో 40 మంది ప్రయాణికులు
  • నలుగురికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఒకటి విజయవాడ సమీపంలో ప్రమాదానికి గురైంది. విశాఖపట్టణం నుంచి హైదరాబాద్ వస్తున్న కాళేశ్వరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు విజయవాడ శివారులో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన నలుగురిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ప్రయాణికులను మరో బస్సులో గమ్యస్థానాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 
Go Back to Shorts
Vijayawada
Kaleshwari Travels
Accident

More Telugu News