video: వీడియో కెమెరాను ఎత్తుకుపోయిన ప‌క్షి.. అది తీసిన వీడియో చూడండి!

  • స‌ముద్ర ప‌క్షుల‌ను వీడియో తీద్దామ‌నుకున్న నార్వే వ్య‌క్తి
  • ఎత్తుకు పోయిన 5 నెల‌ల త‌ర్వాత దొరికిన కెమెరా
  • డ్రోన్ కెమెరా వీడియోను త‌ల‌పించిన రికార్డెడ్ ఫుటేజీ

నార్వేకి చెందిన కెల్ రాబ‌ర్ట్‌స‌న్ అనే వ్య‌క్తి త‌న కెమెరాలో సీ గ‌ల్ అనే స‌ముద్ర ప‌క్షులు ఆహారాన్ని ఆర‌గించ‌డాన్ని వీడియో తీద్దామ‌నుకున్నాడు. అందుకోసం ప‌క్షులకు ఆహారంతో పాటు అక్క‌డే కెమెరాను కూడా పెట్టాడు. కానీ ఆహారం తిన్న ప‌క్షుల్లో ఒకటి ఆ కెమెరాను ఎత్తుకుని పోయింది. మ‌ళ్లీ ఐదు నెల‌ల త‌ర్వాత ఆ కెమెరా దొరికింది.

ప‌క్షి కెమెరాను ఎత్తుకుపోయినప్ప‌టి నుంచి ఆ కెమెరాలో వీడియో రికార్డ‌యింది. ఆ వీడియో అచ్చం డ్రోన్ కెమెరాతో తీసిన వీడియోను త‌ల‌పిస్తోంది. ప‌క్షి కెమెరాను ముక్కుతో పొడ‌వ‌డం, అంద‌మైన లొకేష‌న్ల‌ను వీడియో తీయ‌డం, 300 మీట‌ర్ల ఎత్తు నుంచి అమాంతం కిందప‌డేయడం, త‌ర్వాత మ‌ళ్లీ కెమెరాను ముక్కుతో పొడ‌వ‌డం ఈ వీడియోలో చూడొచ్చు. కెమెరా త‌యారు చేసిన `గోప్రో` సంస్థ ఈ వీడియోను త‌మ అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇప్ప‌టికే ఈ వీడియోకు ప‌దివేల‌కి పైగా వీక్ష‌ణ‌లు వ‌చ్చాయి.

More Telugu News