Rajinikanth: స్టార్ క్రికెట్ లో పాల్గొననున్న రజినీకాంత్, కమలహాసన్

  • జనవరి 6న మలేషియాలో స్టార్ క్రికెట్
  • అజిత్ కూడా పాల్గొనాలని కోరుతున్నాం
  • వెల్లడించిన పొన్ వన్నన్

జనవరి 6న మలేషియాలో స్టార్  క్రికెట్ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో ప్రముఖ నటులు రజనీకాంత్, కమలహాసన్ లు పాల్గొంటున్నారని నడిగర్ సంఘం ఉపాధ్యక్షుడు పొన్ వన్నన్ తెలిపారు. హీరో అజిత్ ను కూడా ఈ పోటీల్లో పాల్గొనాలని కోరుతున్నామని చెప్పారు. స్టార్ క్రికెట్ తో పాటు పలు సంప్రదాయ సినీ కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నట్టు తెలిపారు. మలేషియా ప్రభుత్వంతో కలసి నటీనటుల సంఘం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని చెప్పారు. నడిగర్ సంఘం భవన నిర్మాణానికి నిధులను సమకూర్చుకునే నిమిత్తం ఈ క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నారు.

More Telugu News