Rohit Sharma: నా భార్యకు ఇదే అపురూప పెళ్లిరోజు కానుక: రోహిత్ శర్మ

  • వన్డేల్లో మూడు సార్లు డబుల్ సెంచరీ సాధించిన క్రికెటర్ గా రికార్డు
  • ఇన్నింగ్స్ ను భార్య రితికాకు అంకితం చేస్తున్నానన్న రోహిత్
  • ఆమె పెవిలియన్ లో ఉంటే తనకెంతో ఆనందమని వెల్లడి
తన వివాహ ద్వితీయ వార్షికోత్సవం రోజున చేసిన ద్విశతకాన్ని తన జీవిత భాగస్వామి రితికా సజ్జేకు బహుమతిగా ఇస్తున్నట్టు భారత కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. నిన్న మ్యాచ్ అనంతరం మాట్లాడిన రోహిత్, ఈ ఇన్నింగ్స్ తనకెంతో ప్రత్యేకమని, తన భార్య పెవిలియన్ లో కూర్చుని మ్యాచ్ చూసినందుకు తనకెంతో ఆనందంగా ఉందని చెప్పాడు. తాను ఆమెకు ఇస్తున్న అపురూప కానుక ఇదని, రితిక తన బలమని, తన కోసం ఆమె ఎప్పుడూ ఆ స్థానంలో ఉండాలని కోరుకుంటున్నానని అన్నాడు.

తాను చేసిన మూడు డబుల్ సెంచరీల్లో ఏది ప్రత్యేకమని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేనని, అవన్నీ కీలక సమయాల్లోనే వచ్చినవని చెప్పుకొచ్చాడు. అయితే, కోల్ కతాలో చేసిన 264 పరుగులు మరింత కాలం తన మనసులో మిగిలిపోతాయని చెప్పాడు. ఒకవేళ తాను తొలి సెంచరీని వేగంగా సాధించినా, వికెట్ ఇచ్చే వాడిని కాదని, డబుల్ సెంచరీని సాధించే ఉండేవాడినని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు.
Rohit Sharma
Ritika Sazza
India
Sri Lanka
Cricket
Double Century

More Telugu News