Telenor: తెలుగు రాష్ట్రాల ప్రీపెయిడ్ కస్టమర్లకు టెలినార్ సరికొత్త ఆఫర్లు

  • ఏపీ, తెలంగాణ  సర్కిల్‌లో అందుబాటులోకి సరికొత్త ప్లాన్‌లు
  • రూ.94తో అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్
  • ఉభయ తెలుగు రాష్ట్రాల్లో టెలినార్‌కు 42 లక్షలమంది ఖాతాదారులు
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రీపెయిడ్ ఖాతాదారుల కోసం టెలినార్ సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. 94 రూపాయల రీచార్జ్‌తో అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్ మాట్లాడుకోవచ్చు. కాలపరిమితి 28 రోజులు. 299 రీచార్జ్‌తో 84 రోజుల కాలపరిమితితో లోకల్, ఎస్టీడీ కాల్స్‌ను అపరిమితంగా చేసుకోవచ్చని టెలినార్ తెలిపింది. రూ.143 ఎస్టీవీతో 28 రోజులపాటు అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్‌తోపాటు 2జీబీ 4జీ డేటాను పొందవచ్చని పేర్కొంది.

వినియోగదారులు చెల్లించే మొత్తానికి సరిపడా విలువైన ప్యాక్ ఇవని టెలినార్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిల్ హెడ్ శ్రీనాథ్ కొటియన్ తెలిపారు. రెండు రాష్ట్రాల్లో కలిపి తమకు 42 లక్షల మంది ఖాతాదారులు ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు.
Telenor
Andhra Pradesh
Telangana

More Telugu News