నవ్వుకుంటూ మాట్లాడుకున్న ప్రధాని మోదీ, మన్మోహన్ సింగ్!
- ఉగ్రదాడి మృతులకు నివాళి కార్యక్రమంలో పాల్గొన్న ఇరు నేతలు
- ఆప్యాయంగా పలకరించుకున్న కాంగ్రెస్, బీజేపీ నాయకులు
- విమర్శలు పక్కన పెట్టి మృతులకు నివాళి
ప్రధాని మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కరచాలనం చేసుకోవడం, కేంద్రమంత్రులు సుష్మా, రవిశంకర్‌ప్రసాద్ రాహుల్‌తో నవ్వుతూ మాట్లాడటం వంటి దృశ్యాలు అక్కడ ఆవిష్కృతమయ్యాయి. 2001లో పార్లమెంటుపై జరిగిన దాడిలో తొమ్మిది మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇంకా ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌తో పాటు పలువురు సీనియర్ నేతలు కూడా పాల్గొన్నారు.

